
సక్సెస్ ఫుల్ హీరో ఆది సాయి కుమార్, కోలీవుడ్ నటుడు సతీష్ ప్రధాన పాత్రల్లో ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఈగో రాజా’. ఈ మూవీకి గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో ఆది కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు. శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ హీరోయిన్లు. మాస్ మహారాజా రవితేజ ‘ఈగో రాజా’ టీజర్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ టీజర్‌ను విడుదల చేసి టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు!!
