ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు.
సమంత మాట్లాడుతూ.. “నందినీ గారు, రాజ్ గారు ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్‌గా ఉంటారు. ‘మా ఇంటి బంగారం’లో ప్రతీ ఎమోషన్ ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. యాక్షన్, డ్రామా, కామెడీ అన్ని అంశాలుంటాయి. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. ఓ బేబి తర్వాత నందినిరెడ్డితో నేను చేసిన మరో బ్లాక్ బస్టర్ ఇది. అభిమానులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు.

