HomeEntertainment"బాలన్ - ది బాయ్" సినిమాపై ప్రశంసలు కురిపించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం

“బాలన్ – ది బాయ్” సినిమాపై ప్రశంసలు కురిపించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం

- Advertisment -

గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ “బాలన్ – ది బాయ్”. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహించారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇటీవలే ఈ సినిమా హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. “బాలన్ – ది బాయ్” సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది.

ఈ సినిమా తెలుగులో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. హీరో నాగచైతన్యతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు “బాలన్ – ది బాయ్” సినిమాకు సపోర్ట్ గా నిలిచారు. మలయాళంలో డైరెక్టర్ ప్రియదర్శన్ అప్రిషియేట్ చేశారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక దంపతుల ప్రశంసలు అందుకుందీ మూవీ. తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం “బాలన్ – ది బాయ్” సినిమాపై ప్రశంసలు కురిపించారు.

“బాలన్ – ది బాయ్” సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరైన డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రాన్ని తిలకించారు. ఈ సినిమా స్క్రిప్ట్ ను, నటీనటుల పర్ ఫార్మెన్స్ ను మణిరత్నం అభినందించారు. మణిరత్నం ప్రశంసలు ఎంతో విలువైనవిగా భావిస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించారు. ఇండియన్ సినిమా గర్వించే దర్శకుడు మణిరత్నం నుంచి తమ సినిమాకు ప్రశంసలు రావడం సంతోషంగా ఉందని “బాలన్ – ది బాయ్” టీమ్ తెలిపారు.

నటీనటులు – ఆదిశేషన్, ఫర్జానా పాలతింగల్, ముహమ్మద్ జినాన్, టొవినో థామస్, గిరీష్ ఎ.డి., జీన్ పాల్ లాల్, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటర్ – వివేక్ హర్షన్
డీపీవో – షైజు ఖాలిద్
మ్యూజిక్ – సుషిన్ శ్యామ్
పీఆర్ఓ – సురేష్ ( ఎస్ కె మీడియా )
రచన – జితూ మాధవన్
నిర్మాతలు – వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్
దర్శకత్వం – చిదంబరం

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments