
సక్సెస్ఫుల్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న 14వ చిత్రానికి ‘రికార్డ్’ (RECORD) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, ది స్టోరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీర కోగటం రచన, దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయడంతోపాటు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తోపాటు నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు, ఏషియన్ సునీల్ నారంగ్ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, సుకుమార్ కెమెరా స్విచాన్ చేశారు. బన్నీ వాసు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు డీవీవీ దానయ్య, దిల్ రాజు చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు!!
