Friday, December 5, 2025
HomeEntertainmentసక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, "కలర్ ఫొటో", "బేబి" మేకర్స్ కాంబో క్రేజీ మూవీ...

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, “కలర్ ఫొటో”, “బేబి” మేకర్స్ కాంబో క్రేజీ మూవీ “చెన్నై లవ్ స్టోరీ”

- Advertisment -

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, “కలర్ ఫొటో“, “బేబిమేకర్స్ కాంబో క్రేజీ మూవీచెన్నై లవ్ స్టోరీనుంచి హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ బర్త్ డే పోస్టర్ రిలీజ్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రోజు హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విశెస్ తెలియజేస్తూ “చెన్నై లవ్ స్టోరీ” సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో బ్యూటిఫుల్ లవ్ పెయిర్ గా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీలో నివి క్యారెక్టర్ తో శ్రీ గౌరి ప్రియ ప్రేక్షకులకు మరింత చేరువకానుంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేశ్
నిర్మాతలు – సాయి రాజేశ్, ఎస్ కేఎన్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments