ఒక వ్యక్తి నుంచి క్షమాపణ పొందడానికి నాకు మూడు వారాలు పట్టింది. నేను ఈ సారి మౌనంగా ఉండాలని అనుకోలేదు. ఎందుకంటే నా కోసం నేను నిలబడకపోతే, నా తరఫున ఎవరూ నిలబడరని నాకు తెలుసు. ఈ అనుభవం నన్ను లోతుగా గాయపరిచింది. నాకు కావల్సింది కేవలం ఒక నిజమైన క్షమాపణ, బాధ్యతను స్వీకరించడం మాత్రమే.
ఇలాంటి చిన్న చిన్న ప్రతిఘటనలే ఆడవాళ్ళ గొంతుని మూగబోకుండా కాపాడుతాయి. నాకంటే ముందు ధైర్యం గా మాట్లాడిన ఆడవాళ్ల వరుసలోనే నేనూ నిలబడి ఉన్నాను… వారి ధైర్యమే నాకీ రోజు బలాన్నిస్తుంది.
పత్రికా రంగం వృత్తిపై నాకు చాలా గౌరవం ఉంది. ప్రజలకు నిజం తెలియజేయడంలో ప్రాణం పెట్టే జర్నలిస్టులు ఈ సమాజానికి వెలుగు చూపే దీపాల్లాంటి వారు. కానీ ఆ శక్తిని సార్థకమైన సంభాషణల కంటే వ్యక్తిగత దాడుల కోసం వాడినప్పుడు, అది ఎంతో బాధని కలిగిస్తుంది.
నేను ఇంక ఈ విషయాన్ని ప్రశాంతంగా ముగిస్తున్నాను. ఇకపైన కూడా ఆత్మగౌరవంతో నడవబోతున్నాను.. నిజాయితీతో తన కథని వినిపించే ప్రతి మహిళకు గౌరవం తెలియజేస్తూ…

