Friday, December 5, 2025
HomeEntertainmentగంగ-మంగ రీ-రీ-రీమేక్ లో శ్రీదేవి కూతురు

గంగ-మంగ రీ-రీ-రీమేక్ లో శ్రీదేవి కూతురు

- Advertisment -

శ్రీదేవి స్టార్ డమ్ కి అద్దం పట్టిన చిత్రాల్లో “చాల్ బాజ్” ఒకటి. ఈ చిత్రంలో అతిలోక సుందరి పోషించిన డబల్ రోల్స్ కి రజనీకాంత్, సన్నీ డియోల్ వంటి సూపర్ స్టార్స్ సపోర్టింగ్ రోల్స్ లాంటి లవర్స్ గా నటించడం విశేషం. తెలుగులో ఎన్టీఆర్ నటించిన “రాముడు-భీముడు” చిత్రానికి ఫీమేల్ వెర్షన్ గా… వాణిశ్రీ – కృష్ణ – శోభన్ బాబులతో తెరకెక్కిన “గంగ – మంగ” చిత్రం తరహాలో… హిందీలో రీమేక్ అయిన “రామ్ ఔర్ శ్యామ్” చిత్రానికి హీరోయిన్ ఓరియంటెడ్ వెర్షన్ గా హేమమాలిని నటించిన “సీతా ఔర్ గీతా” చిత్రం విజయ దుందుభి మ్రోగించింది. అదే చిత్రానికి కాసిన్ని మార్పులు చేర్పులు చేసి శ్రీదేవితో తెరకెక్కిన చిత్రం “చాల్ బాజ్”. ఇప్పుడు ఈ చిత్రాన్ని జాన్వి కపూర్ తో ఫ్రెష్ గా మళ్ళీ రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తన తల్లి నటించిన చిత్రాల్లో జాన్వీకి… “చాల్ బాజ్” చిత్రం చాలా ఇష్టం. అందుకే ఈ చిత్రం రీమేక్ లో నటించే అవకాశం రావడం ఆలశ్యం… తక్షణం ఓకే చెప్పేసిందని సమాచారం!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments