HomeEntertainmentస్క్రిప్ట్ విన్నప్పుడే ఇది కదరా కతంటే అనుకున్నాను

స్క్రిప్ట్ విన్నప్పుడే ఇది కదరా కతంటే అనుకున్నాను

- Advertisment -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కలయికలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన “పెద్ది” జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘థాంక్ యూ మీట్‌” నిర్వహించింది. రామ్ చరణ్, జగపతిబాబు, బుచ్చిబాబు సానా, నిర్మాత సతీష్ కిలారు, మైత్రి రవి పాల్గొని… “పెద్ది” సాధిస్తున్న సంచలన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు!!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ… “అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా ప్రతి రోజు సినిమా కలెక్షన్లు పెరుగుతుండటం, ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ పెరుగుతుండటం చూస్తున్నాను. ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా సినీ లైబ్రరీలో నెంబరు 1, 2 గా నిలిచే సినిమా ఇది. మొదటిసారి కథ విన్నప్పుడు బుచ్చిబాబును హగ్ చేసుకున్నాను. “ఇది కదరా కథoటే” అనిపించింది. కానీ ఇది ఎంత రిస్క్ అయిన కథ అనేది తర్వాత తెలిసింది” అని అన్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments