
ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించిన రొమాంటిక్, లవ్ ఎంటర్టైనర్ ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ‘హైకూ’ చిత్రానికి హరి హరన్ రామ్ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌కి నచ్చే అందమైన ప్రేమ కథా చిత్రంగా ‘హైకూ’ అక్టోబర్ 23న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
‘హైకూ’ షూటింగ్ పూర్తి కాకముందే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాకు ఉన్న ఫ్రెష్ స్టోరీ, ప్రత్యేకమైన ప్రజెంటేషన్ నెట్‌ఫ్లిక్స్‌ను ఆకట్టుకోవడంతో ఫ్యాన్సీ రేటుకు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది!!
