HomeEntertainmentఫ్లాష్ ఫ్రేమ్ స్టూడియోస్ & అకాడమీ ఘన ప్రారంభం

ఫ్లాష్ ఫ్రేమ్ స్టూడియోస్ & అకాడమీ ఘన ప్రారంభం

- Advertisment -

ఫ్లాష్ ఫ్రేమ్ స్టూడియోస్ & అకాడమీ ఘన ప్రారంభం
సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా ప్రారంభమైన నూతన సినీ విద్యా సంస్థ

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఫ్లాష్ ఫ్రేమ్ స్టూడియోస్ & అకాడమీ ఘనంగా ప్రారంభమైంది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలనే కల కలిగిన యువతకు నాణ్యమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ యాంకర్ రవి, ప్రముఖ నేపథ్య గాయని గీతా మాధురి, లెజెండరీ సినిమాటోగ్రాఫర్ ఎం.వి. రఘు, ప్రముఖ నిర్మాత పి.ఎల్.కె. రెడ్డి, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ హాజరై కార్యక్రమాన్ని మరింత వైభవంగా మార్చారు.

యాంకర్ రవి రిబ్బన్ కట్ చేసి సంస్థను అధికారికంగా ప్రారంభించగా, ప్రముఖ గాయని గీతా మాధురి ఫ్లాష్ ఫ్రేమ్ స్టూడియోస్ & అకాడమీ అధికారిక లోగోను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథులు సంస్థను సందర్శించి, శిక్షణా వసతులను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమానికి సినీ, టెలివిజన్, మీడియా రంగాలకు చెందిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, సంగీత దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, ఎడిటర్లు, డబ్బింగ్ కళాకారులు, ఫోటోగ్రాఫర్లు, యూట్యూబ్ క్రియేటర్లు మరియు పలువురు సినీ ప్రముఖులు హాజరై ఫ్లాష్ ఫ్రేమ్ స్టూడియోస్ & అకాడమీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సమక్షంలో కార్యక్రమం సినీ వేడుకను తలపించేలా ఘనంగా జరిగింది.

ఈ సంస్థను 13 సంవత్సరాలకు పైగా రియల్‌టైమ్ సినీ పరిశ్రమ అనుభవం కలిగిన హర్షవర్ధన్ రెడ్డి స్థాపించారు. ఆయన సీఈఓ & ఫౌండర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో కూడిన నాణ్యమైన శిక్షణను అందించాలనే లక్ష్యంతో ఈ అకాడమీని స్థాపించినట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా జైదేవ్ ఆకుల మేనేజింగ్ డైరెక్టర్గా సంస్థ అభివృద్ధి, నిర్వహణ, పరిశ్రమ అనుసంధాన కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు.

ఫ్లాష్ ఫ్రేమ్ స్టూడియోస్ & అకాడమీలో వీడియో ఎడిటింగ్, డబ్బింగ్, ఫిల్మ్ & టెలివిజన్ పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్ డిజైనింగ్, ఫిల్మ్ మేకింగ్, వాయిస్ ట్రైనింగ్, డిజిటల్ మీడియా తదితర కోర్సులు పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా బోధించనున్నారు. అత్యాధునిక స్టూడియోలు, రియల్‌టైమ్ ప్రాజెక్టులు, ప్రాక్టికల్ ట్రైనింగ్ మరియు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో విద్యార్థులను సినీ రంగానికి సిద్ధం చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్య అతిథులు, ఇలాంటి పరిశ్రమ ఆధారిత శిక్షణా సంస్థలు భవిష్యత్ సినీ ప్రతిభను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఫ్లాష్ ఫ్రేమ్ స్టూడియోస్ & అకాడమీ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

“సృజనాత్మకతకు ప్రొఫెషనల్ దిశ… ప్రతిభకు విజయవంతమైన భవిష్యత్తు…” అనే లక్ష్యంతో ప్రారంభమైన ఫ్లాష్ ఫ్రేమ్ స్టూడియోస్ & అకాడమీ, భవిష్యత్ సినీ, టెలివిజన్ మరియు డిజిటల్ మీడియా రంగాలకు నైపుణ్యం కలిగిన కొత్త తరాన్ని తీర్చిదిద్దేందుకు తన విజయ ప్రస్థానాన్ని ప్రారంభించింది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments