
ఎవర్‌గ్రీన్ క్లాసిక్ కింగ్ నాగార్జున ‘గీతాంజలి’ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 13న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 4K వెర్షన్‌లో ‘గీతాంజలి’ గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం అద్భుతమైన కథనం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, గొప్ప సంగీతంతో ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేసింది. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా ప్రేమ, భావోద్వేగాలు, అందమైన అనుభూతులను ప్రత్యేకమైన శైలిలో ఆవిష్కరించింది.
