Saturday, May 24, 2025

Top 5 This Week

Related Posts

గంతులేస్తున్న గవిరెడ్డి

ప్రముఖ కథానాయిక సమంత నిర్మాతగా మారుతూ నిర్మించిన తొలిచిత్రం ‘శుభం’. హారర్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయపథంలోకి దూసుకెళుతోంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్రధారురుల్లో ఒకరిగా నటించిన గవిరెడ్డి శ్రీనివాసరావు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ… ‘శుభం చిత్రం ఘన విజయం సాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా సినిమాతో పాటు అన్ని పాత్రలను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. నా పాత్రను కూడా ఆడియన్స్‌ బాగా ఆదిరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నా పాత్ర గురించి మాట్లాడుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంది. నా పాత్రతో అందరూ కనెక్ట్‌ అవుతున్నారు. బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. త్వరలోనే ప్రతి థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులను మా యూనిట్‌తో పాటు కలవబోతున్నాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన సమంత గారికి, దర్శకుడికి నా ధన్యవాదాలు. భవిష్యత్‌లో ప్రేక్షకులను మరిన్ని మంచి పాత్రలతో అలరిస్తాను’ అన్నారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles