” మన శంకర వర ప్రసాదు ” గారిని కలిసి వచ్చాం.
మీసాల పిల్ల పాట సూపర్ హిట్టు అవ్వడమే కాదు, ఆ పిల్ల, నయనతార గారు కూడా
ఆ రోజు షూటింగు లో ఉండడం,
మా సినిమా ‘బాస్’ షూటింగు విశేషాలు తలుచుకుని నవ్వుకోవడం,
మా రాబోయే సినిమా ‘ఫణి ‘ కథానాయిక కేథరిన్ కూడా సెట్లో ఉండడంతో ఒకటే నవ్వులు,
( అమెరికా లో షూటింగ్ విశేషాలు తల్చుకుని)
మిత్రులు, దర్శకులు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి గార్ల అభిమానం, హాస్పిటాలిటీ బ్రహ్మాండం..
సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి గారు, ఆపరేటివ్ కెమెరామన్ బాబు,
కో-డైరెక్టర్ శ్రీను గారితో సహా
ఎక్కువమంది ఆత్మీయులున్న
అరుదైన షూటింగ్ సెట్ అది..
సినిమా సంక్రాంతి విన్నరే ఖాయంగా..
ఆల్ దబెస్ట్ “మన శంకర వర ప్రసాదు” గారికి





