కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎమ్‌వీ రాధాకృష్ణ తెలుగులో విడుదల చేస్తున్న కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస’. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ‘రాక్షస’ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసిన ఆయన.. తాజాగా ‘వీర చంద్రహాస’ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారు. సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించి మూడు వందల కోట్లు కలెక్షన్స్ రాబట్టిన “మహావతార్ నరసింహ” తర్వాత హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో విడుదల చేస్తున్న “వీర చంద్రహాస” చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఆ చిత్రం తరహాలోనే ఇది కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని నిర్మాతలు అంటున్నారు. సంగీత సంచలనం రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతంతోపాటు దర్శకత్వం కూడా వహించడం విశేషం!!
ఫ్రమ్ ది మేకర్స్ ఆఫ్ మహావతార్ నరసింహా వీర చంద్రహాస్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
