HomeEntertainmentఇబ్బందిని ఇబ్బంది పెట్టి ఇబ్బంది పడొద్దంటున్నారు

ఇబ్బందిని ఇబ్బంది పెట్టి ఇబ్బంది పడొద్దంటున్నారు

- Advertisment -

వైవిధ్యమైన పాత్రల్లో నటించి విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు పొందిన స్టార్ యాక్ట‌ర్ ఫ‌హాద్ ఫాజిల్‌, ఇండ‌స్ట్రీ హిట్ బాహుబ‌లి మూవీని నిర్మించిన మేక‌ర్స్‌తో పాటు సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్రం ‘డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్’. షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌పై తొలిసారి డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రేమ‌లు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ..ఇప్పుడీ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను ఇండియ‌న్ సినిమాకు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన బాహుబ‌లి ఫ్రాంచైజీ నిర్మాతలైన ఆర్కా మీడియాతో క‌లిసి రూపొందిస్తున్నారు.

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత‌లు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ క‌ల‌సి ఈ ఆసక్తికరమైన, కంటెంట్ రిచ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే వినోదాన్ని పంచుతూ ఆసక్తిని రేకెత్తించిన టీజర్ త‌ర్వాత మేకర్స్ ‘కేకు వాకు’ అనే వీడియో సాంగ్‌కు ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా అక్టోబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్లు అనౌన్స్ చేస్తూ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments