తెలుగులో స్ట్రెయిట్ గా సినిమాలు చేయడంలోని మజా మరిగిన మల్టీ టాలెంటెడ్ తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. “సర్, కుబేర” చిత్రాల తర్వాత ధనుష్ నటించే పాన్ ఇండియా తెలుగు చిత్రాన్ని సృజనాత్మక దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం మేరకు… “నీది నాది ఒకే కథ, విరాటపర్వం” చిత్రాల తర్వాత వేణు దర్శకత్వం వహించే ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి!!
