ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన సినిమాటోగ్రఫీ శాఖామంత్రి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
“సినెటేరియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2025” వెబ్ సైట్ ను తెలంగాణ రాష్ట్ర సినెమాటోగ్రఫీ మరియు రోడ్లు భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాదు నగరంలో జరగనున్న ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. రానున్న డిసెంబర్ 20, 2025న ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు సినెటేరియా ఫౌండేషన్ పేర్కొంది.
ప్రముఖ స్వచ్చంద సంస్థ సినెటేరియా ఫౌండేషన్ “సినెటేరియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2025” ను డిసెంబర్ 20, 2025 నుంచి డిసెంబర్ 28, 2025 వరకు హైదరాబాదులో నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే సినిమాలను హైదరాబాదు నగరంలోని 9 సినిమా మాల్స్ లలో, 9 రోజులపాటు నిర్వహించనున్నామని సినెటేరియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం డైరెక్టర్ వెంకటేశ్వర్లు బులెమోని తెలియజేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ నృత్యోత్సవం, ఫిలిం ఎక్జిబిషన్, ఫిల్మిన్వెస్ట్ 2025 సమ్మిట్, సినిమా టెక్నాలజీ మరియు వ్యాపారంపై మాస్టర్ క్లాసెస్, కంటెంట్ బి2బి మీట్స్ తదితరాలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సినెటేరియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో పోటీకి చలన చిత్రాలు, షార్ట్ ఫిలింస్, మ్యూజిక్ ఆల్బంస్, డాక్యుమెంటరీ ఫిలింస్ ఆహ్వానిస్తున్నామనీ, 2024 మరియు 2025 సంవత్సరాలలో నిర్మించిన చిత్రాలను పోటీకి పంపించవచ్చునని తెలిపారు. చలన చిత్రాలు పంపించడానికి చివరి తేదీ ఈ అక్టోబర్ 15, 2025. మరిన్ని వివరాలకోసం http://cinetaria.com/index.html వెబ్ సైట్ లో చూడవచ్చుననీ, లేదా ఫోన్ నంబర్ 87122 17555 ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు!!
