HomeEntertainmentషూటింగ్ బరిలోమళ్ళీ దాదాగిరి

షూటింగ్ బరిలోమళ్ళీ దాదాగిరి

- Advertisment -

దాదా’ సినిమా షూటింగ్ మైసూరులో పునఃప్రారంభమైంది. ఇటీవల గాయపడిన బాలకృష్ణ కోలుకుని తిరిగి షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. కీలకమైన షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో టాకీ పార్ట్‌ చిత్రీకరిస్తున్నారు. చిత్రంలోని ముఖ్య తారాగణం ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో “దాదా”పై భారీ అంచనాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని స్టైలిష్ కమర్షియల్ యాక్షన్ స్పెక్టకిల్‌గా తెరకెక్కిస్తున్నారు. ‘ది కింగ్ ఆఫ్ కెయాస్’గా బాలకృష్ణను పరిచయం చేసిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments