HomeEntertainmentత్వరలో సెట్స్ మీదకు అగమ్య

త్వరలో సెట్స్ మీదకు అగమ్య

- Advertisment -

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘ఋషి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై రూపొందుతున్న కొత్త చిత్రం ‘అగమ్య’ కార్యాలయం ఈరోజు చాలా ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు పొట్టిమామ, అలాగే నటి మరియు నిర్మాత రోజా భారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

​ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రమణ మల్లి మాట్లాడుతూ, ‘అగమ్య’ ఒక ప్రత్యేకమైన శైలిలో రూపొందుతున్న చిత్రమని, ఇది అన్ని సినిమాలకంటే భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందన్న పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఋషి ప్రొడక్షన్స్ వారు ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నామని, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోందని వెల్లడించారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments