HomeEntertainmentహీరోయిన్ అభిరామి చేతుల మీదుగా ‘కలర్స్ హెల్త్‌కేర్’ కొత్త బ్రాంచ్ ప్రారంభం

హీరోయిన్ అభిరామి చేతుల మీదుగా ‘కలర్స్ హెల్త్‌కేర్’ కొత్త బ్రాంచ్ ప్రారంభం

- Advertisment -

▪️ ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్‌కేర్’
▪️ మధురైలో ‘కలర్స్ 2.0’ నూతన బ్రాంచ్ ఏర్పాటు
▪️ బరువు నియంత్రణ, చర్మం, కేశ సంరక్షణకు ఆధునిక వెల్‌నెస్ సేవలు

మ‌ధురై: ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్‌కేర్’ తమిళనాడులోని మధురై నగరంలో తన నూతన బ్రాంచ్‌ను ఘనంగా ప్రారంభించింది. ‘కలర్స్ 2.0’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక వెల్‌నెస్ కేంద్రాన్ని ప్రముఖ హీరోయిన్ అభిరామి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా హీరోయిన్ అభిరామి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవనశైలి, ఆరోగ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని మధురై నగరంలో ‘కలర్స్ 2.0’ కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. బరువు నియంత్రణతో పాటు చర్మం, జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి ఇలాంటి ప్రత్యేక వెల్‌నెస్ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ‘కలర్స్ హెల్త్‌కేర్’ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ఒక ప్యాకేజీ తీసుకుంటే మరో ప్యాకేజీని ఉచితంగా అందిస్తున్నారని, అవసరమైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య అవసరాలు, జీవనశైలిలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సదుపాయాలతో మధురైలో నూతన కేంద్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. స్థానిక ప్రజల జీవనశైలిని పరిగణనలోకి తీసుకుని వారికి అవసరమైన ప్రత్యేక వెల్‌నెస్ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.

‘కలర్స్ హెల్త్‌కేర్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన తమ సంస్థ ఇప్పుడు తమిళనాడులోనూ వేగంగా విస్తరిస్తోందన్నారు. ఇప్పటికే వెలచెర్రీ, కుంభకోణం, చెన్నై తదితర నగరాల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాజాగా చారిత్రక, సాంస్కృతిక నగరమైన మధురైలో ‘కలర్స్ 2.0’ నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.

గత 22 ఏళ్లుగా వెల్‌నెస్ రంగంలో సేవలందిస్తున్న తమ సంస్థ.. బరువు నియంత్రణ ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగించే ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తోందని వెంకట శివాజీ కూన తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 250 మందికి పైగా న్యూట్రిషనిస్టులు, 100 మందికి పైగా నిపుణులైన వైద్యులు, 2,000 మందికి పైగా శిక్షణ పొందిన టెక్నీషియన్లు సేవలందిస్తున్నారని వెల్లడించారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు పొందిన పరికరాలతో అంతర్జాతీయ స్థాయి వెల్‌నెస్ సేవలను ‘కలర్స్ 2.0’ ద్వారా అందిస్తున్నామని వివరించారు.

ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా డెర్మటాలజీ, వెల్‌నెస్ సేవలను సమగ్రంగా అందిస్తున్న సంస్థగా ‘కలర్స్’ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. నిపుణులైన డెర్మటాలజిస్టులు, ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన సిబ్బంది సహకారంతో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

మధురై నగరంలోని చొక్కికులంలోని గోఖలే రోడ్డులో ఉన్న ‘ఆరా ఎంటర్‌ప్రైజెస్’ వద్ద ‘కలర్స్ 2.0’ నూతన బ్రాంచ్‌ను పూర్తి సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో బరువు నియంత్రణ కార్యక్రమాలతో పాటు చర్మ సౌందర్యం, కేశ సంరక్షణకు సంబంధించిన ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రారంభోత్సవం సందర్భంగా ‘కలర్స్ హెల్త్‌కేర్’ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఒక ప్యాకేజీ తీసుకుంటే మరో ప్యాకేజీని ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

అందరికీ మెరుగైన ఆరోగ్య, సౌందర్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ‘కలర్స్ హెల్త్‌కేర్’ యాజమాన్యం పేర్కొంది. 5ఎం మీడియా ఆధ్వర్యంలో, జైదీప్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక యువతతో పాటు పలువురు ప్రముఖులు, వెల్‌నెస్ రంగానికి చెందిన నిపుణులు, సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments