HomeEntertainmentఒక ట్రైలర్.. ఆలోచింపజేసే ప్రశ్న..నివేదా థామస్ జీ5 ఒరిజినల్ మూవీ ‘శ్రీమతి’ ట్రైలర్ రిలీజ్

ఒక ట్రైలర్.. ఆలోచింపజేసే ప్రశ్న..నివేదా థామస్ జీ5 ఒరిజినల్ మూవీ ‘శ్రీమతి’ ట్రైలర్ రిలీజ్

- Advertisment -

కొత్తగా పెళ్లైన అమ్మాయి.. వేయి ఆశ‌ల‌తో అత్తారింట్లోకి అడుగు పెడుతుంది. అత్త‌, మామ‌ల‌కు సేవ చేస్తుంది.. భ‌ర్త‌కు ప్రేమానురాగాల‌ను అందిస్తుంది. మెట్టినింటి ఆచారాలు, వ్య‌వ‌హారాల‌ను పాటిస్తుంది.. అయితే అదే ఆమె ప్రపంచ‌మా? ఆమెకు కోరిక‌లు, ఆశ‌యాలు, ల‌క్ష్యాలు ఉండవా? ఎంతో ఇష్టంగా చ‌దివిన చ‌దువు, నేర్చుకున్న క‌ళ .. క‌ల‌లుగానే మిగిలి పోవాలా?.. అంటే మ‌న దేశంలో స‌గ‌టు భార‌త స్త్రీ జీవితం ఇలాగే ఉంది. అలాంటి వారికి ప్ర‌తిబింబ‌మైన అమ్మాయి మ‌ధుశ్రీ క‌థే.. ‘శ్రీమతి’. డిసెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. జీ5 ఒరిజిన‌ల్ మూవీగా స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాలో నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. తిరువీర్‌, హ‌రితేజ‌, రేణూ దేశాయ్‌, గోప‌రాజు ర‌మ‌ణ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. విశ్వ‌క్ ఖండేరావు ద‌ర్శ‌క‌త్వంలో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

“Srimathi” Trailer:
https://www.zee5.com/movies/details/srimathi/0-0-1z51111478

సోమ‌వారం ఈ ఒరిజిన‌ల్ మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ గ‌మ‌నిస్తే.. తిరువీర్‌, నివేదా థామ‌స్ కొత్త‌గా పెళ్లైన జంట‌గా క‌నిపించారు. కొత్త కోడ‌లు, అత్తారింటికి వ‌చ్చిన‌ప్పుడు ఆమెలో ఉండే బెరుకు, భ‌యం, ఉద్యోగానికి వెళ్లాల‌నుకున్న‌ప్పుడు ఆమెకు ఇరుగు పొరుగు, బంధు మిత్రులు నుంచి ఎదురయ్యే ప్ర‌శ్న‌లు.. వీటి వ‌ల్ల ఆమెలోని భావోద్వేగాలు ఎలాంటి స్థాయికి చేరుకున్నాయ‌నే విష‌యాల‌ను చాలా చ‌క్క‌గా ఆవిష్క‌రించారు.

ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోస్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ఇండియ‌న్ టాప్ ఓటీటీ జీ5 తెలుగు లైబ్ర‌రీలో మ‌రో వైవిధ్య‌మైన సినిమా చేరింది. అదే శ్రీమ‌తి. ఈ ఒరిజిన‌ల్ మూవీ ట్రైల‌ర్ చూస్తుంటే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులను మెప్పించేలా ఎమోష‌న‌ల్ డ్రామాగా దీన్ని రూపొందించార‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. పూర్తి సినిమాను ఎంజాయ్ చేయాల‌నుకుంటే డిసెంబ‌ర్ 4 వ‌ర‌కు ఆగాల్సిందే నంటున్నారు మేక‌ర్స్‌.

నటీనటులు:

  • నివేదా థామస్ – మధుశ్రీ
  • తిరువీర్ – వాసుదేవ్
  • హరితేజ – సునీత
  • గోపరాజు రమణ – హీరో తండ్రి
  • రేణు దేశాయ్ – డ్యాన్స్ మెంటర్
  • విజ్జి చంద్రశేఖర్ – జానకి
  • రాజీవ్ కనకాల – హీరోయిన్ తండ్రి
  • రాజశ్రీ – హీరోయిన్ తల్లి
  • ఐశ్వర్య భాస్కరన్ – అత్త
  • సుదర్శన్
  • విరాజ్ అశ్విన్ – అర్జున్
  • మానిక చక్కిలా

సాంకేతిక వర్గం:

  • డైరెక్ట‌ర్‌: విశ్వక్ ఖండేరావు
  • చీఫ్ కో-డైరెక్టర్: గోపిరెడ్డి మల్లికార్జున రెడ్డి
  • నిర్మాతలు: కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య లూయిస్ శర్మ
  • ఛాయాగ్రహణం: ఆదిత్య జవ్వాడి
  • ఎడిటర్: రవితేజ గిరిజాల
  • సంగీతం: ఈ.ఎల్. విశ్వనాథ్
  • క్రియేటివ్ & ప్రొడక్షన్: ఎలిసియం మాక్సిమా ఇండియా – చెన్నై

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments