HomeEntertainmentమాటల మాంత్రికురాలుసుమ సారధ్యంలోసంకోచం వీడండి - గొంతు విప్పండి

మాటల మాంత్రికురాలుసుమ సారధ్యంలోసంకోచం వీడండి – గొంతు విప్పండి

- Advertisment -

పబ్లిక్ స్పీకింగ్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, ఇంపాక్ట్‌ఫుల్ కమ్యూనికేషన్‌లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకునే వారి కోసం ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రత్యేకంగా ‘Unmute with Suma – ధైర్యంగా మాట్లాడండి’ పేరుతో వన్ డే వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. స్కిల్ స్టూడియో ప్రో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జనవరి 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. పబ్లిక్ స్పీకింగ్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఈ వర్క్‌షాప్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్‌లో సుమ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘Unmute with Suma’ వర్క్‌షాప్ వివరాలను తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ఒక నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా ఈ జర్నీలో మీరు నాకు ఎంతో ప్రేమను అందించారు. ఇవన్నీ కంటిన్యూ చేస్తూనే ఈరోజు నా జర్నీ ఒక కొత్త మలుపు తిరుగుతోంది. ఒక కోచ్‌గా, ఒక ట్రైనర్‌గా పబ్లిక్ స్పీకింగ్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, ఇంపాక్ట్‌ఫుల్ కమ్యూనికేషన్ కోచింగ్ ప్రోగ్రామ్‌ను నేను మొదలుపెట్టబోతున్నాను. దాని పేరే ‘Unmute with Suma – ధైర్యంగా మాట్లాడండి’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, కార్టూనిస్ట్ బ్నిo కూడా పాల్గొన్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments