పి.ఎస్.జె. ఫిలిమ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’. ఈ మూవీలో G.V.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ వంటి వారు కీలక పాత్రలో, సుజనా,అనుపమ స్వాతి, మాధవి, అద్వైక జెస్సీ, హసిత, జెన్నీ,ప్రసాద్ రామ్, నరేంద్ర, ముఖ్య పాత్రల్లో నటించారు. నవంబర్ 27న ‘ఆలోచన’ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా చేయబోతోన్నట్టుగా ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రదీప్ మాట్లాడుతూ… మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఆలోచన మూవీకి 2 ఇయర్స్ నుంచి స్క్రిప్ట్ పైన వర్క్ చేశాము. 27కి రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్‌కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నా అన్నారు.
హీరో బెన్నీ మాట్లాడుతూ… నేను మంచి యాక్టర్స్‌తో కలిసి నటించాను. నా అదృష్టం ఇంత మంచి సీనియర్స్‌తో కలిసి నటించడం. నాకు ఇంత మంచి అవాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.
హీరోయిన్ జెస్సీ మాట్లాడుతూ… నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు చాలా థ్యాంక్స్. ఆడియన్స్ అందరూ మా సినిమాని సపోర్ట్ చేసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంత మంది సీనియర్ యాక్టర్స్‌తో కలిసి నటించడం నా అదృష్టం.
డైరెక్టర్ చాచా సురేందర్ మాట్లాడుతూ… టీమ్‌లో ఉన్న పెద్దలు. పూజ్యులుగా మిగిలిన నారాయణరావుగారికి అందరికీ కృతజ్ఞతలు. మా డీఓపీ సురేందర్రెడ్డి ఒక 2ఎపిసోడ్స్ చేస్తే అక్కడ పరిచయం అయ్యారు. ఆయన నాకు గురువుగారిలాంటి వారు. ఆర్ట్ డైరెక్టర్ గిరీష్ వీరందరూ కూడా నాకు ఫ్రెండ్స్.
మ్యూజిక్ డైరెక్టర్ వియాన్ నాకు తమ్ముడు లాంటి వాడు. నేను ప్లాన్ చేసుకున్న ప్రకారం చేయడానికి సహకరించిన నా నిర్మాతలకు చాలా చాలా కృతజ్ఞతలు అన్నారు.
నటి మాధవి మాట్లాడుతూ… నాకు ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు చాలా చాలా కృతజ్ఞతలు అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడుతూ… ఈ చిత్రం పిల్లలకు మాత్రమే లాంటి సినిమా. కచ్చితంగా పిల్లలు చూడాల్సిన సినిమా. పిల్లలు తల్లిదండ్రులను నగరాల్లో వదిలేసి విదేశాలకు వెళ్ళడం అనే అంశాన్ని తీయడం మంచిది. ఏది ఏమైనా మంచి సినిమా. మంచు పల్లకి సినిమాకి దీనికి పోలిక కనిపిస్తుంది. ఐదుగురు కుర్రాళ్ల సినిమాగా ఉంటుంది. నెగిటివ్, పాజిటివ్ అంశాన్ని చూపించారు. అందుకు దర్శకుడ్ని అభినందించాలి. మారిన సామాజిక స్థితిగతుల గురించి కూడా చూపించి ఉంటే బావుండేది. ఏది ఏమైనా చాలా మంచి సినిమా తీశారు. ఇంత మంచి సినిమా తీసినందుకు దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను.
నటి అనుపమ మాట్లాడుతూ… ముందుగా మా డైరెక్టర్ సురేందర్ చాచా గారికి కృతజ్ఞతలు. ఇంత మంది పెద్దవాళ్ళతో కలిసి నటించడం నా అదృష్టం. నాకు ఇంత మంచి అవకాశం లభించడం నా పూర్వజన్మసుకృతం.
కెమెరామెన్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ… ఈ సినిమా ఆలోచన సురేందర్ చాచా ముందుగ ప్రపోజల్ తీసుకువచ్చారు. నేను ఆ నలుగురు చేసినప్పుడు ఆ సినిమా ఆడుద్దా లేదా అనే డౌట్ ఉండేది. కానీ ఈ నిర్మాతలకు అసలు డౌట్ లేదు. చాచా ఈ సినిమా పెయింటింగ్ లాగా చేద్దాం అన్నారు. అప్పుడు నాకు టఫ్‌గా అనిపించింది. ఈ చిత్రానికి బ్యక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా సపోర్ట్ చేశారు. ఈ కథని అందరూ ఎంతో బాగా నమ్మారు. యాక్టర్స్ ఎంత బాగా ఇన్‌వాల్వ్ అయి చేశారు. అన్నది మూవీ చూస్తే మీకు అర్ధమవుతుంది. ఆడియో అనేది సినిమాకి ఎంత అవసరమో ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. చాచా ఈ సినిమా తరువాత అంతా అద్భుతాలే చేస్తారు అని చెప్పవచ్చు. మా చాచా ఆలోచనలు అవి చాలా డిఫరెంట్. మేము కలిసి మరో సినిమా చేయాలనుకుంటున్నాను. సురేష్‌కొండేటి ఎవరికీ అందని అంత ఎత్తుకి ఎదిగిపోయారు. చాలా థ్యాంక్స్ . మా సినిమాని ఇంతలా ప్రోత్సహిస్తున్నందుకు. ఆయన తీసుకునే డెసిషన్స్ చాలా గొప్పగా ఉంటాయి. ఆయన ఆలోచన విధానం చాలా బావుంటుంది. అందుకే ఎవ్వరికీ అందని అంత ఎత్తుకి ఎదిగిపోయారు.
సురేష్‌కొండేటి మాట్లాడుతూ… నేను ఇలాంటి సినిమాలు మన ఎస్‌కె పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేశాం. ఈసినిమా చాలా
అద్భుతమైన సినిమా.అందరూ థియేటర్‌కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నా. ఇక సినిమా టికెట్ రేట్ కేవలం 100 రూపాయలకి మాత్రమే పెట్డడం జరిగింది. 60ఏళ్ళు వచ్చిన సీనియర్స్ ఎవరైనా థియేటర్స్ వద్దకి వచ్చి ఆధార్ కార్డు చూపిస్తే సినిమా ఫ్రీగా చూడవచ్చు. చాలా అద్భుతంగా ఈ సినిమా సీనియర్ సిటిజన్స్ అందరూ వచ్చి చూడొచ్చు. పెద్దవాళ్ళు ఏదో ఒక సన్నివేశంలో కనెక్ట్ అవుతారు. ప్రతీ యువత కూడా చూడాలి వారు వయసు మళ్ళిన తరువాత వారి లైఫ్ కూడా ఇంతే అని తెలుసుకుంటారు. ఈ ఆధారకార్డు 3 రోజులు పెట్టడం జరిగింది.
నటుడు హరి మాట్లాడుతూ… నేను రాజమండ్రి నుంచి వచ్చాను. లేటు అయింది అందరికీ క్షమాపణలు. ముఖ్యంగా నా ప్రయత్నం లేకుండా ఏదైనా ఒక పాత్ర వస్తే ఆ పాత్ర నాకు మంచి గుర్తింపు తీసుకువస్తుంది. ఇంత గొప్ప నటులతో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత సీనియర్స్‌తో కలిసి చేయడం తో నేను క్రమశిక్షణ అనేది నేర్చుకున్నాను. ఈ సినిమాలో చాలా మంచి లెంగ్త్ ఉన్న క్యారెక్టర్. ఇంత లెంగ్త్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడూ రాలేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు. ముఖ్యంగా క్లైమాక్స్ చిత్రీకరణ చాలా అద్భుతంగా వచ్చింది. ఎమోషనల్ సీన్స్ సూపర్బ్.
సినియర్ నటి జయలలిత మాట్లాడుతూ… మా సినిమా మాకు ముద్దుగా ఉంటుంది. మన బిడ్డలు మనకి ముద్దుగా అన్నట్లు ఉంటుంది. చాచా గారు ఎందుకు ఆ పేరు పెట్టుకున్నారంటే చార్లిచాప్లిన్‌కి ఆయన అభిమాని అందుకే ఆయన పేరు పెట్టుకున్నారు. నేను ఏ పాత్ర చేసినా చాలా ఎక్స్‌పెక్టెడ్‌గా చేస్తాను. కానీ ఈ సినిమా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ సినిమా చేశాను. కానీ సినిమా చాలా బాగా వచ్చింది. సహకరిస్తున్న కాట్రగడ్డ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు .మా బంగారం సురేష్ కొండేటి ఈ సినిమాని ఇంత ముందుకు తీసుకువెళుతున్నందుకు ఆయనకు పాదాభివందనాలు అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ… సంతోషం సురేష్‌కొండేటిగారికి కృతజ్ఞతలు. సినిమాని ఎంతో బాగా ముందుకు తీసుకువెళుతున్నాను. నేను ఈ సినిమా గురించి ఒక పాటలో చెపుతాను. ఆ పాట రాసిన ప్రతాప్ రాజులపల్లి గారికి కృతజ్ఞతలు. నాకు ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చే అదృష్టం దక్కింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాచా అన్నకి చాలా థ్యాంక్స్
నటుడు ప్రసాద్‌రావు మాట్లాడుతూ… చాచాగారునాకు మంచి పాత్ర ఇచ్చారు. తెర వెనుక నేను ఎడిటర్‌గా పనిచేశాను. నేను తెర మీద ఎడిట్ చేస్తూ వాళ్ళతో కలిసి నటించడం చాలా అదృష్టం. నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన వారందరికీ చాలా థ్యాంక్స్ అన్నారు.
మ్యూజిక్ మాధవ్ మాట్లాడుతూ… భజగోవిందం లాంటి సాంగ్ ఉన్న సినిమా సూపర్ప్. లెజండరీ యాక్టర్స్‌తో ఈ సినిమా చేయడం ఆనందం.
నటుడు ప్రసాద్‌బాబు మాట్లాడుతూ… పెద్దలందరికీ నమస్కారం. మేము ముగ్గురం షూటింగ్ చేసేటప్పుడు. మాకు వయసులు అయిపోయినా కూడా ఇప్పటి యువతరంతో కలిసి నటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమాలో మేము ఎక్కడా కనిపించం మా పాత్రలే కనిపిస్తాయి. మా సినిమాటోగ్రాఫర్ చాలా బాగా తీశారు. గిరి ఆర్ట్‌డైరెక్టర్ ఎంతో అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా కాలేజీల్లో. స్కూళ్లలో చూపించమనడం చాలా థ్యాంక్స్ 27 దయచేసి థియేటర్లలో సినిమాని చూడండి. అందరికీ థ్యాంక్స్
నటుడు నర్సింహరాజు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నటించడానికి జీ.వి. నారాయణరావు కారణము. ఆయన నాకు స్నేహితుడు. ఆయనకు ఈ కథ చాలా ఇష్టం. ఆయన లేకుండా ఈ సినిమా రిలీజ్ అవ్వడం చాలా బాధగా ఉంది. ఎన్నో సినిమాలు చేసినా కొన్ని విడుదల కూడా అవ్వవు. అయితే డైలాగులు, టేకింగ్, ఆర్టిస్టులు, సురేందర్, సురేందర్ రెడ్డి వీరందరినీ చూసిన తరువాత నా ఆలోచన తప్పు వీరి ఆలోచనే కరెక్ట్ అనుకున్నా. చాలా బాగా అద్భుతంగా తీశారు. ఈ సినిమాకి సురేష్‌కొండేటి చేయడంతో దీనికి ఎంతో కళ వచ్చింది. అందరికీ ధన్యవాదాలు.
నటీనటులు : G.V నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ తదితరులు
టెక్నికల్ టీం
బ్యానర్ : పి.ఎస్.జె. ఫిలిమ్స్ కో
నిర్మాత : ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన
దర్శకుడు : సురేందర్ చాచా
కెమెరామెన్ : టి. సురేంద్ర రెడ్డి
సంగీత దర్శకుడు : వియాన్
ఎడిటర్ : ఆర్.ఎల్. వర్మ
ఆర్ట్ డైరెక్టర్ : గిరీష్ దేవాంగ్
రిలీజ్ : ఎస్. కె. పిక్చర్స్.
పి ఆర్ ఓ : శ్రీధర్ శ్రీ
