ఫైన్ ఫ్యాషన్ జ్యువెలరీలో ఆధునిక లగ్జరీ అనుభూతిని అందిస్తున్న VARAM

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో VARAM తన రెండవ ఫ్లాగ్షిప్ స్టోర్‌ను నవంబర్ 20, 2026న ఘనంగా ప్రారంభించింది. ప్రముఖ యాంకర్, నటి, నిర్మాత శ్రీమతి సుమ గారు ఉదయం 11:00 గంటలకు ఈ నూతన స్టోర్‌ను ప్రారంభించారు.
ఆధునిక డిజైన్‌తో రూపొందించిన ఈ 1,500 చదరపు అడుగుల స్టోర్‌లో ఫ్యాషన్ జ్యువెలరీకి సంబంధించిన పూర్తి స్థాయి కలెక్షన్ అందుబాటులో ఉంది. ఇయర్ రింగ్స్, నెక్లెస్‌లు, రింగ్స్, బ్రాస్లెట్స్, హారాలు, వడ్డాణాలు, ప్రత్యేకంగా రూపొందించిన జ్యువెలరీ సెట్స్‌తో పాటు ఎన్నో ఆకర్షణీయమైన డిజైన్లు కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. కస్టమర్లు తమకు నచ్చిన ఆభరణాలను స్వయంగా చూసి, ధరించి, తమ స్టైల్‌కు అనుగుణంగా ఎంచుకునేలా స్టోర్‌ను ఆధునికంగా తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా VARAM వ్యవస్థాపకురాలు, CEO ప్రియాంక వేములూరి మాట్లాడుతూ..
“VARAM తొలి స్టోర్ ప్రారంభం మా ప్రయాణంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. మా డిజైన్ ఆలోచనలను కస్టమర్లకు ప్రత్యక్షంగా పరిచయం చేస్తూ, మా ఆభరణాల్లోని నాణ్యత, నైపుణ్యం, విభిన్నమైన డిజైన్లను వారు స్వయంగా అనుభవించే అవకాశాన్ని ఈ స్టోర్ కల్పిస్తుంది. సంప్రదాయ జ్యువెలరీ కౌంటర్లా కాకుండా, ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా ఆభరణాలను ఎంచుకునే ప్రత్యేకమైన ప్రదేశంగా ఈ స్టోర్ ఉండాలని మేము కోరుకున్నాం” అని తెలిపారు.
ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్
VARAM స్టోర్‌లో ప్రతి రూ.5,000 విలువైన కొనుగోలుపై ఒక ఉచిత బంగారు నాణెం అందిస్తున్నారు.
