Thursday, February 5, 2026
HomeEntertainmentవిజయదశమి సందర్బంగా "బాలి" చిత్రం పోస్టర్, గ్లింప్స్ రిలీజ్

విజయదశమి సందర్బంగా “బాలి” చిత్రం పోస్టర్, గ్లింప్స్ రిలీజ్

- Advertisment -

పాలిక్ స్టూడియోస్, బి ఎస్ ఆర్ కె, డి ఆర్ ఎస్ మరియు ఆర్ ఎస్ క్రియేషన్ టీమ్ వర్క్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “బాలి”. ఈ చిత్రానికి పాలిక్ కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. మారుమూల ప్రాంతంలోని ఒక తాండాలో జరిగిన యధార్థ కథని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు జన్మలకు సంబంధించిన ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ మనిషికి భగవంతుడు తోడైతే అనే ఒక మంచి కథ నేపథ్యంతో నిర్మిస్తున్న చిత్రం “బాలి”. ఈ చిత్రంలో ఐదు పాటలు, ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు, కామెడీ, సెంటిమెంట్ అన్ని కల కలుపుకొని ఒక చక్కటి జానపద చిత్రంగా మీ ముందుకు రాబోతుంది అన్నారు దర్శకుడు పాలిక్. విజయదశమి సందర్బంగా ఈ చిత్రం యొక్క పోస్టర్ మరియు గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం ఇటీవల మేడారం, ఏటూరు నాగారం, ఛత్తిష్ ఘడ్ సరిహద్దుల్లో మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో అద్భుతమైన లొకేషన్ల లో చిత్రీకరించారు. ఈ చిత్రం లో గబ్బర్ సింగ్ సాయి, సుమన్ శెట్టి, జీవ,శ్రీమన్, మోహన, రఘు
అనిరుద్, ఐశ్వర్య, రేవతి, సంజయ్ పాటిల్ , మానస.. తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం జాన్ భూషణ్, పాటలు: సురేష్ గంగుల, కెమెరామెన్: ఆనం వెంకట్, ఆర్ట్ :నరేష్ , సత్య నగేష్, నాయుడు, ఎడిటర్: నిశాంత్, పి ఆర్ ఓ : చందు రమేష్, మాటలు. తోటపల్లి సాయినాథ్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: పాలిక్.
ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం 2026 లో థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు మేకర్స్.
నిర్మాతలు ఎక్కువ మంది ఉండడంతో టీం వర్క్ మీడియా అని ఒక బ్యానర్ పేరుని ఖరారు చేసి అందరూ ఆ బ్యానర్ లో పని చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments