HomeEntertainmentఅగ్ర హీరోల దండయాత్ర

అగ్ర హీరోల దండయాత్ర

- Advertisment -

రెండు వారాల్లో నలుగురు సీనియర్ హీరోలు… ప్రేక్షకులకు పండగే పండగ!

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల సినిమాల విడుదల అంటేనే అభిమానులకు పండగ. అలాంటిది కేవలం రెండు వారాల వ్యవధిలో నలుగురు అగ్ర హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం అరుదైన పరిణామం.

డిసెంబర్ 24న నందమూరి బాలకృష్ణ ‘దాదా’, అక్కినేని నాగార్జున ‘కింగ్ 100’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న ‘దాదా’ 1980ల నాటి ముంబై నేపథ్యంలో సాగే హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. మరోవైపు నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచే వందో చిత్రం ‘కింగ్ 100’. రా కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో టబు మరోసారి నాగార్జునతో జత కట్టడం విశేషం. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ అంశాలకూ ఈ చిత్రం ప్రాధాన్యతనిస్తోంది.

ఇక సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’, విక్టరీ వెంకటేష్ ‘జనవరి 12 విడుదల’ చిత్రాలు సందడి చేయనున్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’లో చిరంజీవి సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. సాధారణ మధ్యతరగతి వ్యక్తి వెనుక దాగిన మరో కోణం ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కల్యాణ్ రామ్ కలయికలో వస్తున్న ‘జనవరి 12 విడుదల’ మల్టీస్టారర్ కావడం మరో విశేషం. ఇలా క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు నాలుగు భారీ చిత్రాలు బాక్సాఫీస్‌ను పలకరించనున్నాయి. నాలుగు భిన్నమైన కథలు, నాలుగు ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్‌లు, వెరసి తెలుగు సినిమా ప్రేక్షకులకు వరుస పండగలు ఖాయం. థియేటర్ల కేటాయింపు నుంచి వసూళ్ల వరకు ఈ సినిమాల ప్రభావం ఎలా ఉండబోతోంది? ఏ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది? అన్నది ఆసక్తికరం!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments