HomeEntertainmentరోత పుట్టిస్తున్న రాధిక ఆప్టే

రోత పుట్టిస్తున్న రాధిక ఆప్టే

- Advertisment -

నిప్పులు చెరుగుతున్న నెటిజనులు

నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లెజెండ్’లో నటించిన అనుభవంపై బాలీవుడ్ నటి రాధికా ఆఫ్టే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల తన తాజా వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ.. ఓ తెలుగు సినిమాలో తనకంటే చాలా పెద్ద వయసున్న నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని, ఆ అనుభవం తనకు ఏమాత్రం నచ్చలేదని వ్యాఖ్యానించారు. ఆమె సినిమా పేరు ప్రస్తావించకపోయినా, ఈ వ్యాఖ్యలు 2014లో వచ్చిన బాలకృష్ణ ‘లెజెండ్’ గురించేనని అందటికీ తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో రాధిక ఆప్టేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, ‘లెజెండ్’ తర్వాతి ఏడాదే బాలకృష్ణతో ‘లయన్’ సినిమాలోనూ నటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో ‘లెజెండ్’ చిత్రాన్ని ప్రశంసించిన ఆమె ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటాన్ని ప్రశ్నిస్తున్నారు.

నచ్చని పాత్రలో నటించానని చెప్పే హక్కు నటీనటులకు ఉంటుంది. అయితే, ఒక పరిశ్రమ ఇచ్చిన అవకాశాలను స్వీకరించినప్పుడు ఒకలా, పదేళ్ల తర్వాత మరోలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అన్నదే ఇప్పుడు అసలు చర్చ.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments