యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా “మాయలేడి”. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు “మాయలేడి”తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. “మాయలేడి” సినిమా ఈ నెల 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఆర్ట్ డైరెక్టర్ భార్గవ నౌండ్ల మాట్లాడుతూ – రాకేష్ గారితో గతంలో జితేందర్ రెడ్డి సినిమాకు వర్క్ చేశాను. ఆయనతో నేను వర్క్ చేస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమాకు పనిచేసే అవకాశం కల్పించిన రాకేష్ గారికి, మా డైరెక్టర్ ప్రశంకర్ గారికి థ్యాంక్స్. ఈ నెల 13న రిలీజ్ కు వస్తున్న మా సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
ఫైట్ మాస్టర్ అంజి మాట్లాడుతూ – మాయలేడి సినిమాలో ఒక డిఫరెంట్ యాక్షన్ ను ఎంజాయ్ చేస్తారు. మా హీరో హీరోయిన్స్ ఇద్దరూ కష్టపడి యాక్షన్ సీక్వెన్స్ లు ప్రాక్టీస్ చేశారు. బాగా పర్ ఫార్మ్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ కు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. అన్నారు.
నటి మధురిమ మాట్లాడుతూ – మాయలేడి సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. అన్ని పాటలూ మెలొడియస్ గా ఉన్నాయి. రాకేష్ ప్రొడ్యూసర్ గా హీరోగా మిమ్మల్ని ఆకట్టుకుంటాడు. ఆయన చేసిన క్రిష్ క్యారెక్టర్ మూవీకి హైలైట్ గా నిలుస్తుంది. హీరోయిన్ మధుమిత పర్ ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.
హీరోయిన్ మధుమిత సర్కార్ మాట్లాడుతూ – ఇది తెలుగులో నాకు మొదటి సినిమా. మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని నమ్ముతున్నాం. నా పర్ ఫార్మెన్స్ ను మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. మాయలేడి ఒక బ్యూటిఫుల్ మూవీ. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. నా క్యారెక్టర్ లో పర్ ఫార్మ్ చేసేందుకు చాలా స్కోప్ ఉంది. ఎన్నో లొకేషన్స్ లో మా మూవీ చేశాం. మా మూవీ కంటెంట్ పట్ల మీలో కనిపిస్తున్న ఎగ్జైట్ మెంట్ చూస్తున్నాం. మా సినిమా మీ అందరి ఆదరణ పొందుతుందని ప్రేమను గెలుచుకుంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.
డైరెక్టర్ ప్రశంకర్ మాట్లాడుతూ – రిలేషన్ షిప్ లో ఎన్నో ఎమోషన్స్ చూస్తాం. తన గర్ల్ ఫ్రెండ్ లోని డిఫరెంట్ ఎమోషన్స్ ను క్రిష్ అనే అబ్బాయి ఎలా ఫేస్ చేశాడు అనేది మా మూవీలో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఒక బంధాన్ని కొనసాగిస్తున్న క్రమంలో భాగస్వామికి ఉన్న సంతోషం, కోపం వంటి ఎన్నో రకాల భావోద్వేగాలను ఎక్సిపీరియన్స్ చేయించేలా కథ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ అని భావిస్తున్నాం. మంచి మ్యూజిక్ , ఎంటర్ టైన్ మెంట్ తో పాటు చిన్న మెసేజ్ కూడా మా మూవీలో ఉంటుంది. అన్నారు.
హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రె మాట్లాడుతూ – రెండేళ్ల గ్యాప్ తర్వాత మీ ముందుకు వచ్చాను. పేకమేడలు, ఎవరికీ చెప్పొద్దు సినిమాల తర్వాత ఎలాంటి కథలు ఎంచుకోవాలని ఆలోచించాను. ఈ సారి పక్కా కమర్షియల్ మూవీ చేద్దాం, అయితే అందులోనూ మన తరహా వైవిధ్యమైన కథ చూపించాలని అనుకున్నాం. ఫ్యామిలీ ఎలిమెంట్స్, మ్యూజిక్ కు ప్రాధాన్యత ఉండేలా ఒక మన్మథుడు, నువ్వునాకు నచ్చావ్, నిన్నే పెళ్లాడతా..ఇలాంటి తరహాలో సినిమా ఉండాలని ప్లాన్ చేశాం. ఖుషి సినిమాలా ఒక వైబ్ ఉన్న లవ్ స్టోరీ తెరపై చూసి చాలా కాలమవుతోంది. అలాంటి జానర్ మూవీని నేనే పర్సనల్ గా మిస్ అవుతున్నా అనిపించింది. అలాంటి ప్రయత్నమే మనం ఎందుకు చేయకూడదు అనుకున్నా. మనకు యాక్షన్ సినిమాలు చాలా వస్తున్నాయి. ఇలాంటి ట్రెండ్ లో మనం అనుకున్న జానర్ ట్రై చేద్దామని ముందుకొచ్చాం. ఆ టైమ్ లో ప్రశంకర్ ఒక స్క్రిప్ట్ మీద ట్రావెల్ అవుతున్నా. ఈ స్క్రిప్ట్ చేసేందుకే మాకు దాదాపు ఏడాది టైమ్ పట్టింది. స్క్రిప్ట్ లాక్ అయ్యాక మ్యూజిక్ ఇంపార్టెంట్ గా భావించి విశాల్ చంద్రశేఖర్ ను అప్రోచ్ అయ్యాం. ఆయనకు వెంటనే కథ నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. నాతో పాటు సమానంగా స్క్రీన్ స్పేస్ హీరోయిన్ క్యారెక్టర్ కు ఉంటుంది. అలాంటి పాత్రకు ఎవరిని తీసుకుందామనే ఆలోచనలో ఉన్నప్పుడు మధుమిత మా టీమ్ లోకి వచ్చేసింది. నేను ప్రొడ్యూసర్ అయితే ఈ కథను కాంప్రమైజ్ కాకుండా చేయగలను అనుకున్నాను. నా మార్కెట్ కంటే ఎక్కువే ఖర్చు చేసి సినిమా చేశాం. ఇది బ్లాక్ బస్టర్ అందించే స్క్రిప్ట్ అని నమ్మాను. నన్ను నిలబెట్టే సినిమా అని అనిపించింది. అందుకే ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా నా కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టాను. బ్లడ్ బాత్ చేయించే యాక్షన్ మూవీస్ వరుసగా వస్తున్న ఈ టైమ్ లో మాయలేడి లాంటి సినిమా రీఫ్రెషింగ్ గా ఉంటుందని అనుకుంటున్నా. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ సినిమా పెద్ద హిట్ అయితే మరో మంచి సినిమా చేస్తాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం నా కెరీర్ కు ఎంతో ముఖ్యం. మీరు థియేటర్ లో హాయిగా ఒక మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఎంజాయ్ చేస్తారని , థియేటర్ నుంచి హ్యాపీగా బయటకు వస్తారని ప్రామిస్ చేస్తున్నా. అన్నారు.
నటీనటులు -రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, తదితరులు
టెక్నీషియన్స్
మ్యూజిక్ – విశాల్ చంద్రశేఖర్
బ్యానర్ – క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్ – రాకేష్ వర్రే
స్క్రిప్ట్, డైరెక్షన్ – ప్రశంకర్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)

