వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో ముఖ్యమైన పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. ఈ సినిమాలో బిజిలీగా నటిస్తున్న రుహానీ శర్మ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. నవంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది!!

