HomeEntertainmentదసరా శుభాకాంక్షలు తో "శతకోటి దండాలు" అంటున్న షకలక శంకర్

దసరా శుభాకాంక్షలు తో “శతకోటి దండాలు” అంటున్న షకలక శంకర్

- Advertisment -

శరవేగంగా “శతకోటి దండాలు” షూటింగ్ పూర్తి.

శ్రీ ముత్యం మీడియా మరియు నవ్య దివ్య ఆర్ట్స్ పతాకంపై కనకల అప్పారావు, విసినిగిరి శ్రీనివాసరావు సంయుక్త సమర్పణలో షకలక శంకర్ జెప్సీ భద్ర, మౌనిక, హీరో హీరోయిన్లుగా శ్రీ ముత్యం ఇజ్జురొత్తు దర్శకత్వంలో, అనసూయ ఇజ్జురొత్తు నిర్మాతగా రూపొందిస్తున్న ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం “శతకోటి దండాలు.” ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు.
దర్శకుడు శ్రీముత్యం మాట్లాడుతూ “మా షకలక శంకర్ హీరోగా తెరకెక్కించిన డిఫరెంట్ మూవీ” శతకోటి దండాలు.” ఈ చిత్రంలో షకలక శంకర్ రోరింగ్ పెర్ఫార్మెన్స్ చూస్తారు. షకలక శంకర్ చేసిన డాన్స్ గానీ, ఆయన చేసిన పెర్ఫార్మన్స్ గాని అదుర్స్ అనిపిస్తుంది. అలాగే ఈ చిత్రానికి చరణ్ అర్జున్ అందించిన సంగీతం మా సినిమా కు మరొక ఎస్సెట్ గా భావిస్తున్నాను. షూటింగ్ పూర్తి చేసుకున్న మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు హైదరాబాద్ రిథమ్ స్టూడియో లో జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం ” అని అన్నారు.
షకలక శంకర్, జెప్సీ భద్ర, మౌనిక, శుభలగ్నం ఫేమ్ ఆమని, బాలాజీ, ప్రసన్నకుమార్, జబర్దస్త్ అప్పారావు, ఆజ్య శర్మ,గెద్ద వరప్రసాద్, ఎమ్మెస్ నాయుడు, గౌరీ, రమ్య చౌదరి తదితరులు నటించిన ఈ చిత్రానికి


సంగీతం :చరణ్ అర్జున్, కెమెరా :ఈదర సత్యప్రసాద్ ,
ఎడిటింగ్: కొడగంటి వేణుగోపాల్
,రి రికార్డింగ్: తారక్
డాన్స్ :బాలకృష్ణ, కాస్ట్యూమ్స్ :ఎస్ వెంకట రమణ
మేకప్ :ప్రసాద్ దుర్గాసి
,ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : యాండ్రాప్ మనోజ్ నాథ్,
పి ఆర్ ఓ: బి వీరబాబు ,
సహ నిర్మాతలు :నవ్య తేజస్వి ,దివ్య తేజస్వి ,
నిర్మాత: అనసూయ ఇజ్జురొత్తు ,
కథ , మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీముత్యం ఇజ్జురొత్తు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments