HomeEntertainmentద్విగుణీకృత ఉత్సాహంతో ద్వితీయార్ధం

ద్విగుణీకృత ఉత్సాహంతో ద్వితీయార్ధం

- Advertisment -

ఈ నెల ద్వితీయార్థంలో ఆసక్తి రేపుతున్న సినిమాలు… వాటి ప్రత్యేకతలు ఇవే!

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి వారం కొత్త కథలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు వైవిధ్యమైన కథాంశాలతో రూపొందుతున్న చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ ద్వితీయార్థంలో యాక్షన్, ప్రేమకథలు, హారర్ థ్రిల్లర్లతో ప్రేక్షకులకు విభిన్నమైన వినోదం అందనుంది.

అక్టోబర్ 15
జైలర్ 2

సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జైలర్ 2. తొలి భాగం సాధించిన విజయంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.


రణబాలి

అక్టోబర్ 16

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం రణబాలి. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1876–78 మధ్యకాలం నాటి మద్రాస్ కరువు నేపథ్యంలో రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా కావడం ఈ సినిమా ప్రత్యేకత. చారిత్రక నేపథ్యం, పోరాటాలు, భావోద్వేగాలు కథకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

క్రేజీ కళ్యాణం

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం క్రేజీ కళ్యాణం. బద్రప్ప గజుల దర్శకత్వం వహిస్తున్నారు. కుటుంబం, ప్రేమ, వినోదం కలగలిసిన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 16న విడుదల కావాల్సి ఉంది.

అక్టోబర్ 17
గరివిడి లక్ష్మి

ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గరివిడి లక్ష్మి. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. రాగ్ మయూర్, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉండటం విశేషం.

అక్టోబర్ 30
కల్ట్

విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కల్ట్ అక్టోబర్ 30న విడుదలకు ప్రకటించిన చిత్రాల్లో ఒకటి. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాపై యువ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది.

ఇట్లు అర్జున

ఇట్లు అర్జున కూడా అక్టోబర్ 30న విడుదలకు సిద్ధమవుతున్న చిత్రాల జాబితాలో ఉంది. అనీష్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్, రొమాన్స్ అంశాలతో రూపొందుతోంది.

ఏమో ఏమో ఇది

రోషన్ మేక, ప్రీతి ముఖుందన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “ఏమో ఏమో ఇది”. రొమాన్స్, థ్రిల్లర్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

చిన్న సినిమాలదే
ప్రత్యేక ఆకర్షణ!

ఈ నెల విడుదలల జాబితాను పరిశీలిస్తే, భారీ చిత్రాలతో పాటు కొత్త కథాంశాలతో వస్తున్న చిన్న సినిమాలకూ ప్రాధాన్యం కనిపిస్తోంది. పీరియడ్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, హారర్ థ్రిల్లర్, యూత్‌ఫుల్ రొమాన్స్… ఇలా విభిన్న జానర్లలో సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి.
అయితే, ప్రకటించిన విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మొత్తానికి… అక్టోబర్ ద్వితీయార్థం తెలుగు ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమా విందును అందించనుంది. ఏ చిత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుంది? ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది? అన్నది వేచి చూడాలి!

— స్వాతిముత్యం సినిమా ప్రత్యేక కథనం

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments