నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్లో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న’మైసా’ ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్‌తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. నవంబర్ 27, 2026న ‘మైసా’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. “అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను” అంటూ రష్మిక చెప్పే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఇంటెన్సిటీని పరిచయం చేశారు. భయపడని, వెనక్కి తగ్గని గిరిజన మహిళగా ఆమె పాత్ర అద్భుతంగా ఉంది. తాను ఎదుర్కొనే ఎన్నో సవాళ్లు, సామాజిక అడ్డంకులను అధిగమిస్తూ.. ప్రతి సమస్యను ఎదురించి పోరాడే ఒంటరి యోధురాలిగా మైసా కనిపిస్తుంది!!

