ఒక సాధారణ మెంబర్ Fncc క్లబ్ లో జాయిన్ అయిన సురేష్ కొండేటి గతంలో ఫిలింనగర్ కల్చర్ సెంటర్ (FNCC) కి మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ గా మరియు రెండుసార్లు కల్చరల్ కమిటీ చైర్మన్ గా ప్రస్తుతం అడిషనల్ కల్చరల్ కమిటీ చైర్మన్ అనేక సేవలు కమిటీ మెంబర్స్ మరియు సభ్యుల సహాయ సహకారాలతోటి అనేక కార్యక్రమాలు చేసిన సంగతి అందరికి తెలిసిందే.
ఈసారి ఈనెల 27వ తేదీ ఆదివారం రోజు జరగబోయే ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు ప్యానల్ నుంచి జాయింట్ సెక్రటరీగా పోటీ చేయబోతున్నారు. గెలిచిన తర్వాత గతంలో కంటే ఎక్కువగా కష్టపడి ఫిలింనగర్ కల్చర్ సెంటర్ (FNCC) అభివృద్ధికి కృషి చేస్తానని సురేష్ కొండేటి తెలియజేశారు.

