HomeEntertainment"రణబాలి" సినిమాలో రశ్మిక 'జయమ్మ' క్యారెక్టర్ షూటింగ్ పూర్తి, ఎమోషనల్ సెండాఫ్ ఇచ్చిన టీమ్ మెంబర్స్

“రణబాలి” సినిమాలో రశ్మిక ‘జయమ్మ’ క్యారెక్టర్ షూటింగ్ పూర్తి, ఎమోషనల్ సెండాఫ్ ఇచ్చిన టీమ్ మెంబర్స్

- Advertisment -

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ చిత్రంలో రశ్మిక రణబాలి జోడీగా జయమ్మ క్యారెక్టర్ లో నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. షూటింగ్ సెట్ నుంచి చిత్రబృందం ఎమోషనల్ గా ఆమెకు సెండాఫ్ ఇస్తున్న వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

“రణబాలి” సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది.

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ యూట్యూబ్ లో నెం.1 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది.

నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ – మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ – గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ – నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ – రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో – చెర్రి
మ్యూజిక్ – అజయ్ – అతుల్
డీవోపీ – నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ
రైటర్ – ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ – శివం రావు నాగసాని
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చెంబోలు సాయి ఆదిత్య
కొరియోగ్రఫీ – కృతి మహేశ్
కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు
ఆర్ట్ డైరెక్టర్ – విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ – యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
సౌండ్ డిజైనర్ – రఘునాథ్ కెమిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – సురేష్ ( ఎస్ కె మీడియా )
మార్కెటింగ్ – ఫస్ట్ షో

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments