HomeEntertainment"ఎపిక్" సినిమా బ్యూటిఫుల్ గా ఉందంటూ ప్రశంసించిన విజయ్ దేవరకొండ, రశ్మిక

“ఎపిక్” సినిమా బ్యూటిఫుల్ గా ఉందంటూ ప్రశంసించిన విజయ్ దేవరకొండ, రశ్మిక

- Advertisment -

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ పై ప్రశంసలు కురిపించారు విజయ్ దేవరకొండ, రశ్మిక. ఈ చిత్రాన్ని కలిసి హైదరాబాద్ లో వీక్షించారు విజయ్, రశ్మిక. సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు షేర్ చేశారు.

విజయ్ దేవరకొండ స్పందిస్తూ – ఎపిక్ ఒక బ్యూటిపుల్ ఫిలిం. యువత కలల్ని, బాధ్యతల్ని, భయాలను డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించారు. తండ్రీ కొడుకు మధ్య వచ్చే ఫోన్ కాల్ సీన్ చూసినప్పుడు ఎమోషనల్ అయ్యాను. ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నా. ఒక రియలిస్టిక్ సినిమా చేసిన “ఎపిక్” టీమ్ కు శుభాకాంక్షలు. అన్నారు.

రశ్మిక మందన్న స్పందిస్తూ – ఎపిక్ సినిమాలో మనం కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒక మెన్, వుమెన్ మధ్య ఉండే నిజమైన దృక్కోణాలను చూపించారు. తమ పిల్లల్ని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపే తల్లిదండ్రుల్లో ఉండే ఎమోషన్ ను హార్ట్ టచింగ్ గా తెరకెక్కించారు. కుటుంబం కోసం, ప్రేమ కోసం చేసే త్యాగం ఆకట్టుకుంది. ఆనంద్, వైష్ణవి తో పాటు టీమ్ అందరికీ కంగ్రాట్స్. అన్నారు.

ఆదిత్య హాసన్ “ఎపిక్” చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది ఎపిక్ సినిమా. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోందీ మూవీ.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments