బ్లాక్ బస్టర్ ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ‘బేబీ’ జోడీ, ’90s’ దర్శకుడి కలయికలో సితార నిర్మించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యువతలో తారస్థాయి అంచనాలను ఏర్పరచుకున్న ‘ఎపిక్’ చిత్రం, సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో మంగళవారం సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు!!

