నటి త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త తమిళ సైకలాజికల్ హారర్ చిత్రానికి లండన్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ‘ఎయిర్‌లిఫ్ట్’, ‘చెఫ్’, ‘పిప్పా’ చిత్రాల దర్శకుడు రాజా కృష్ణ మీనన్ ఈ సినిమాతో తమిళ చిత్రసీమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్రిషతో పాటు రాధికా శరత్‌కుమార్, అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా మహిళా పాత్రల చుట్టూ సాగే ఈ కథలో మిస్టరీ, సస్పెన్స్, హారర్ అంశాలకు ప్రాధాన్యం ఉండనుంది. పనోరమా స్టూడియోస్ సమర్పణలో లోకోమోటివ్ గ్లోబల్ బ్యానర్స్ పై కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, సుందర్ ఆరోన్, వికాస్ శర్మ, అమిత్ దాల్మియా నిర్మిస్తున్నారు. రాజేష్ మీనన్, జార్జ్ కామెరాన్ సహ నిర్మాతలు కాగా, అభినవ్ మెహ్రోత్రా క్రియేటివ్ ప్రొడ్యూసర్!!

