HomeEntertainmentకీరవాణి గారి లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి రానున్న మరొక సంచలన గీతం - ఈ...

కీరవాణి గారి లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి రానున్న మరొక సంచలన గీతం – ఈ నెల 28న విడుదల

- Advertisment -

ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం జరిగింది. ఈ లేబుల్ ద్వారా ఇప్పటికే నాలుగు పాటలు ఆ పాటలు మ్యూజిక్ లవర్స్ నుండి అద్భుతమైన ఆదరణను పొందాయి. కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ లేబుల్ ద్వారా వచ్చిన తొలి గీతం ముమ్ముకుస్సు వివిధ భాషలలో రావడంతో ప్రత్యేక ఆదరణ లభించింది. ఆ తర్వాత వచ్చిన రాసింది కీరవాణి కూసింది చంద్రబోస్ అంటూ సాగే పాటకు గాయని లిప్సిక తన గాత్రం అందించారు. ఆ తరువాత వచ్చిన రాహుల్ సిప్లిగన్జ్ సర్పంచ్ కూతురు వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ లేబుల్ నుండి వచ్చిన నాలుగవ పాట అన్ఫైర్ లైఫ్ ఒక వినూత్న విధంగా షార్ట్ ఫిలిం తరహాలో వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ లేబుల్ నుండి వచ్చిన 5వ పాటను ప్రముఖ మలయాళ సింగర్ సితార కృష్ణకుమార్ గారు పాడటం మరొక సంచలనం. ఆమెతో కలిసి కీరవాణి గారు తొలిసారి వీడియోలో కనిపిస్తూ రానున్న సాంగ్ చాయురంగ్. ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ పాటకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఈ పాట పై ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ నుండి ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి వచ్చిన పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ పాట ఎలా ఉండబోతుందో అంటూ అందరూ ఈ పాటపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఈ పాట గురించి తెలిసిన వారంతా ఈ పాట కీరవాణి గారి మనసులో నుండి పుట్టుకు వచ్చిన పాటగా చెప్తున్నారు. దీనితో ఈ పాట ఏ స్థాయిలో ఉండబోతుందో అంటూ ప్రేక్షకులలో మరింత అంచనాలు పెరిగాయి. అంతేకాక ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి మరెన్నో పాటలు రానున్నట్లు, రాబోయే కొన్ని నెలలలో మరిన్ని పాటలు విడుదల కానున్నాయని తెలుస్తుంది. ఇక ఆ పాటలు ఎలా ఉండబోతాయో వేచి చూడాలి.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments