సునీల్, అఖిల్ ఉడ్డెమారి, ప్రదాన పాత్రల్లో డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఫైట్ మహా”. “కలలు నిజమైతే నిజం ఎవరిది?” అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ చంద్ర. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా గత నెల విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది, మిలియన్ ప్లస్ వ్యూస్ తో ఆకట్టుకుంటుంది. తాజాగా 2 నిమిషాల 20 సెకండ్స్ నిడివిగల ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్రం ఆగస్టు 21 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది!!

