HomeEntertainmentఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోన్న విశాల్ ‘మకుటం’.. ఆగస్ట్ 7న గ్రాండ్‌గా ట్రైలర్ విడుదల

ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోన్న విశాల్ ‘మకుటం’.. ఆగస్ట్ 7న గ్రాండ్‌గా ట్రైలర్ విడుదల

- Advertisment -

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మాణంలో రాబోతోన్న ఈ మూవీలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలు అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న ఈ తరుణంలో మేకర్లు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించడమే కాకుండా.. ఆగస్ట్ 7న ట్రైలర్‌ను విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారు.

ఇప్పటికే విశాల్ ‘మకుటం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తుండటం.. పైగా దర్శకుడిగా మొదటి సినిమా అవ్వడం, జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ అందరినీ ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించడంతో ప్రమోషన్స్‌లో మరింత స్పీడ్ పెంచేలా కనిపిస్తున్నారు.

ఈ సినిమాకి రిచర్డ్ ఎం. నాథన్, అభినందన్ రామానుజం కెమెరామెన్లుగా, N.B. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక ఈ మూవీని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.

నటీనటులు : విశాల్, అంజలి, దుషార విజయన్, జాన్ విజయ్, జయ ప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబూ సలీం, అర్జయ్, ఝాన్సీ, పదం కుమార్, సభుమోన్ తదితరులు

టెక్నికల్ టీం:

నిర్మాణం: సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాతలు: బి. సురేష్, ఆర్.బి. జీవన్ చౌదరి, జితన్ రమేష్, జీవా
సమర్పణ : R.B. చౌదరి
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: విశాల్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్ & అభినందన్ రామానుజం
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: జి. దురైరాజ్
యాక్షన్ డైరెక్టర్: దిలీప్ సుబ్బరాయన్
ఎడిటర్: N.B. శ్రీకాంత్
పీఆర్వో : సాయి సతీష్

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments