తిరువీర్ నటిస్తున్న తాజా సినిమా “భగవంతుడు”. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రవి పనస నిర్మిస్తున్నారు. జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న “భగవంతుడు” సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘సిత్తరాల నవ్వు’ రిలీజ్ చేశారు. ఈ పాటను కృష్ణ ప్రసాద్ కంపోజ్ చేయగా, డైరెక్టర్ జి జి విహారి లిరిక్స్ అందించారు. జావెద్ అలీ ఆలపించారు!!

