యంగ్ హీరో తిరువీర్ – ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. జూలై 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

