గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న హార్ట్ వార్మింగ్ ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’ . అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ రూపొందుతోంది. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాతలు. తరుణ్ రెడ్డి సహ నిర్మాత. ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృధ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా కీలక పాత్రదారులు. ఈ చిత్రం టీజర్ లాంచ్ చేశారు!!

