నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి – నిశిత నాగిరెడ్డి
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మొదటి నుంచి క్రియేటివ్ ఫీల్డ్‌పై మాకు ఆసక్తి ఉంది. అయితే కేవలం పేరు కోసం మేము ఈ రంగంలోకి రాలేదు. సాఫ్ట్‌వేర్ రంగంలోనే మేము మంచి గుర్తింపు సంపాదించాం. బిజినెస్‌ను విస్తరించే క్రమంలో రియల్ ఎస్టేట్, ఫార్మా లాంటి రంగాలతో పాటు సినిమా కూడా ఒక మంచి రంగమని భావించాం.
రిస్క్ అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. మేము స్టార్టప్ ప్రారంభించినప్పుడు ఆ ట్రెండ్ అసలు లేదు. అప్పట్లో బీటెక్ చేసి అమెరికా వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే ఆలోచనే ఎక్కువగా ఉండేది. కానీ మేము ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేశాం. ఐఐటీ గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ నాలుగేళ్ల పాటు ఎలాంటి ఆదాయం లేకుండా కష్టపడ్డాం. మాపై మాకు ఉన్న నమ్మకం ఈ స్థాయికి తీసుకొచ్చింది. అదే నమ్మకంతో సినిమా రంగంలో కూడా రిస్క్ తీసుకున్నాం.
విరాట్ కర్ణ, దర్శకుడిగా అభిషేక్ నామా ఇద్దరూ కొత్తవారే అయినా మాకు కంటెంట్‌పై బలమైన నమ్మకం ఉంది. లార్జర్ దేన్ లైఫ్ మైథాలజికల్ కథతో సినిమా చేయాలనే ఆలోచన మొదటి నుంచే ఉంది. అభిషేక్ నామా గారు ఇంతకుముందు డెవిల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం ఆయన అద్భుతమైన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేశారు. ఆయన విజన్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది!!

