నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలను పెంచుతోంది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరో. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. మేకర్స్ వీరనాగ సాంగ్ ని రిలీజ్ చేశారు. శ్రీహర్ష ఈమని సాహిత్యం ఆధ్యాత్మిక భావాన్ని బలంగా ప్రతిబింబించగా, దీపక్ బ్లూ తన పవర్ ఫుల్ వోకల్స్ తో పాటకు ప్రాణం పోశారు. జునైద్ కుమార్ – అభే అందించిన సంగీతం ప్రతి ఫ్రేమ్‌లో భక్తి భావాన్ని మరింత ఎలివేట్ చేసింది.
నాగబంధం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

