డివోపి సౌందర్ రాజన్
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా డీవోపీ ఎస్. సౌందరరాజన్ సినిమా విశేషాలు పంచుకున్నారు.
నేను ఇంతకుముందు అభిషేక్ గారితో “డెవిల్” సినిమా చేశాను. అప్పటి నుంచి ఆయనతో చాలా మంచి అనుబంధం ఉంది. అభిషేక్ గారు చాలా పెద్ద విజన్‌తో ఈ కథను మొదలుపెట్టారు. నేను స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఈ ప్రాజెక్టులో ఇన్‌వాల్వ్ అయ్యాను. నాగబంధం ఐడియా మా అందరినీ ఎంతగానో ఉత్సాహపరిచింది. మొదట కథను లాక్ చేశాం. తర్వాత దాన్ని విజువల్‌గా ఎంత గ్రాండ్‌గా, ఎంగేజింగ్‌గా చూపించాలనే దానిపై ప్లాన్ చేశాం.
నేను ఇంతకుముందు ఫాంటసీ సినిమాలు చేశాను. విజువల్స్‌ను గ్లామరైజ్ చేసి, ఎలివేట్ చేసేలా కూడా చేసిన అనుభవం ఉంది. కానీ ఈ సినిమా మాత్రం చాలా ప్రత్యేకం. చాలా నేచురల్ స్టైల్లో ఈ సినిమా చేయడం జరిగింది. ప్రతి సన్నివేశానికి తగ్గట్టుగా సహజమైన లైటింగ్‌తో, కథలో లీనమయ్యేలా తీశాను. ఎక్కడా ఓవర్ గ్లామర్ చేయడం గానీ, అనవసరమైన డ్రామా సృష్టించడం గానీ చేయలేదు.
విజువల్ ఎఫెక్ట్స్‌ను మనం రెండు రకాలుగా వాడుతుంటాం. ఒకటి గ్రాండియర్ కోసం, మరొకటి రియల్‌గా అనిపించేందుకు. అయితే ఆ విజువలైజేషన్ సహజంగా కనిపించడం చాలా పెద్ద టాస్క్. చాలామందిని తీసుకెళ్లి హిమాలయాల్లో షూటింగ్ చేయడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. అలాంటి సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగపడతాయి. కానీ వాటిని సహజంగా, నిజంగా కనిపించేలా చేయడం చాలా కష్టమైన పని. ఈ సినిమాలోని వీఎఫ్‌ఎక్స్ అన్నీ కూడా చాలా నేచురల్‌గా, రియల్‌గా ఉంటాయి.
ఇంతకుముందు కూడా పెద్ద సినిమాలు చేశాను. కానీ ఇంత భారీ స్థాయిలో సెట్లు ఉన్న సినిమాను నేను ఎప్పుడూ చేయలేదు. అంత పెద్ద సెట్లను లైటింగ్ చేయడం, హై స్పీడ్‌లో షూట్ చేయడం చాలా చాలెంజింగ్ వర్క్. షూటింగ్ భారీ స్థాయిలో జరిగింది.
డైరెక్టర్ అభిషేక్ గారి గురించి చెప్పాలంటే…. ఆయన అద్భుతమైన కథను రాసుకున్నారు. ఆ ఆలోచన మా అందరికీ ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. దర్శకుడిగా ఆయన అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఆయన క్లారిటీ, విజువల్ సెన్స్, కోఆర్డినేషన్ అన్నీ అద్భుతం. ప్రతి విభాగం నుంచి బెస్ట్ ఔట్‌పుట్ రాబట్టుకున్నారు!!

