HomeEntertainmentజూలై 2న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌కుసిద్ధమైన ‘ఇసాకపట్నం’.. ప్రతీకారం, రాజకీయాల చుట్టూ తిరిగే పవర్‌ఫుల్ థ్రిల్లర్

జూలై 2న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌కుసిద్ధమైన ‘ఇసాకపట్నం’.. ప్రతీకారం, రాజకీయాల చుట్టూ తిరిగే పవర్‌ఫుల్ థ్రిల్లర్

- Advertisment -

ప్రైమ్ వీడియో తన అత్యంత ఆసక్తికరమైన తెలుగు ఒరిజినల్ సిరీస్‘ఇసాకపట్నం’ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. గ్యారీబీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఏడు ఎపిసోడ్‌ల యాక్షన్ థ్రిల్లర్జూలై 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ వీడియో లో ప్రేక్షకులముందుకు రానుంది.

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్వీడియో తన ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసాకపట్నం’ ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జూలై 2 నుంచిప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.
గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు ప్రశాంత్ రాఘతికథా రచన అందించగా, తాజుద్దీన్ సయ్యద్ సంభాషణలు రాశారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డిబొర్రా నిర్మించారు.

ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ‘ఇసాకపట్నం’ కథలోఅధికారం కోసం జరిగే పోరాటాలు, కుటుంబ విభేదాలు, రాజకీయకుట్రలు, గ్యాంగ్‌స్టర్ సంఘర్షణలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సిరీస్‌లో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించగా, సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజాచెంబోలు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ సందర్భంగా ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ నిఖిల్మాధోక్ మాట్లాడుతూ , “దక్షిణ భారతీయ కథలతో ఇప్పటికేవిభిన్నమైన ఒరిజినల్స్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఇప్పుడు‘ఇసాకపట్నం’ ద్వారా మరొక శక్తివంతమైన కథను ప్రపంచవ్యాప్తంగాతీసుకెళ్తున్నారు. ప్రతీకారం, భావోద్వేగాలు, అనూహ్య మలుపులునిండిన ఈ సిరీస్ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంటుందనినమ్ముతున్నాం. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ అద్భుత నటనతో పాటుగ్యారీ బీహెచ్ దర్శకత్వం ఈ కథకు మరింత బలం చేకూర్చాయి” అనితెలిపారు.

నిర్మాతలు రాహుల్ తమడా, సందీప్ రెడ్డి బొర్రా మాట్లాడుతూ, “‘ఇసాకపట్నం’ ఒక రివెంజ్ థ్రిల్లర్ మాత్రమే కాదు. వ్యక్తిగత నష్టం, విశ్వాసం, కుటుంబ విభేదాలు, రాజకీయ ఆధిపత్య పోరాటం వంటిఅంశాలను భావోద్వేగంగా మిళితం చేసిన కథ ఇది. ఒక పోర్ట్ టౌన్ప్రపంచాన్ని అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించడానికి మాబృందం ఎంతో కృషి చేసింది. ఈ కథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకు తీసుకురావడంలో ప్రైమ్ వీడియో లో కలిసి పనిచేయడంఆనందంగా ఉంది” అన్నారు.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్, అలాగేఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో ‘ఇసాకపట్నం’ జూలై 2 నుంచి భారతదేశంతో పాటు 240కి పైగా దేశాలు, ప్రాంతాల్లోప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

ఇదిలా ఉంటే, ప్రైమ్ డే సందర్భంగా ప్రైమ్ వీడియో అందిస్తున్నప్రత్యేక కంటెంట్ లైనప్‌లో ‘ఇసాకపట్నం’ కూడా ఒక ప్రధానఆకర్షణగా నిలవనుంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments