HomeEntertainmentఉత్కంఠ రేకెత్తించేలా సాగిన ‘థాంక్యూ సుబ్బారావు’ టీజర్

ఉత్కంఠ రేకెత్తించేలా సాగిన ‘థాంక్యూ సుబ్బారావు’ టీజర్

- Advertisment -

‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ ‘రేపు ఉదయం పది గంటలకు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా చెందు ముద్దు మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో రానున్న సరికొత్త సినిమా ‘థాంక్యూ సుబ్బారావు. ఈ మూవీని కె రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర పొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటుగా టీజర్‌ను రిలీజ్ చేశారు.

‘థాంక్యూ సుబ్బారావు’ టీజర్‌ను గమనిస్తే ఎన్నో అంశాలను మేళవంచి తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్ని అంశాల్ని జోడించి ‘థాంక్యూ సుబ్బారావు’ని తెరకెక్కించారు. టీజర్ చాలా ప్లెజెంట్‌గా కనిపిస్తోంది. మురళీధర్ గౌడ్ డైలాగ్స్ కామెడీగా ఉన్నాయి. హీరో హీరోయిన్ల ట్రాక్. ట్రైన్‌లోని అమ్మాయి.. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ కూడా ఆసక్తిని పెంచేశాయి. ఇలాంటి ఓ డిఫరెంట్ సబ్జెక్ట్, కంటెంట్ మూవీని ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు.

ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీత దర్శకుడిగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. డి. వెంకట్ ప్రభు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ఆడియెన్స్‌ను అలరించనున్నారు.

తారాగణం : చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్: కుర్ర ప్రొడక్షన్స్
నిర్మాత: దినేష్ కుర్ర
సమర్పణ: కె రాఘవేంద్రరెడ్డి
దర్శకత్వం: చెందు ముద్దు
ఎడిటర్: డి వెంకట ప్రభు
సంగీతం: ప్రిన్స్ హెన్రీ
DOP: పంకజ్ తొట్టాడ
సాహిత్యం: శ్రీనివాస మౌళి
PRO : సాయి సతీష్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments