HomeEntertainmentహ్యాపీ బర్త్ డే బాలయ్య

హ్యాపీ బర్త్ డే బాలయ్య

- Advertisment -

కొంతమంది నటులు సినిమాల్లో హీరోలు. కొంతమంది అభిమానుల హృదయాల్లో హీరోలు. కానీ అరుదుగా కొందరు మాత్రమే ఒక తరం భావోద్వేగానికి ప్రతీకలుగా నిలుస్తారు.
అలాంటి వారిలో ఒకరు నందమూరి బాలకృష్ణ
ఈరోజు ఆయన పుట్టినరోజు.
ఒక నటుడిగా ఆయన ప్రయాణాన్ని చూస్తే… అది కేవలం విజయాల కథ కాదు. తండ్రి వేసిన మహా వటవృక్షం నీడలో మొదలై, తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని నిర్మించుకున్న వ్యక్తిత్వ గాథ.


తెలుగు సినీ చరిత్రలో ఎన్. టి.రామారావు అనే మహా శిఖరం పక్కన నిలబడటం ఎంత కష్టమో… ఆ శిఖరం నీడలో తనదైన శిఖరాన్ని నిర్మించుకోవడం అంతకంటే కష్టం.
ఆ సవాలును బాలకృష్ణ స్వీకరించారు. ప్రతి దశబ్దానికి ఒక కొత్త మాస్ రూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.
అయన సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు… ఒక ప్రత్యేక శక్తి. ఒక ప్రత్యేక ఉత్సాహం. ఒక ప్రత్యేక థియేటర్ అనుభవం.


తెరపై ఆయన నడక మొదలైతే… అభిమానుల గుండెల్లో వేగం పెరుగుతుంది.
డైలాగ్ మొదలైతే… థియేటర్లలో చప్పట్లు మారుమోగుతాయి.
అది నటనతో మాత్రమే సాధ్యమయ్యే విషయం కాదు. అది దశాబ్దాలుగా సంపాదించుకున్న అభిమాన బలం.
అయితే బాలకృష్ణను ప్రత్యేకంగా నిలబెట్టేది కేవలం ఆయన మాస్ ఇమేజ్ మాత్రమే కాదు.


స్నేహితులకు స్నేహితుడిగా… అభిమానులకు ఆప్తుడిగా… తనకు నచ్చిన విషయాల విషయంలో నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
అందుకే ఆయనను అభిమానించే వారు కేవలం సినిమాల కోసం కాదు… ఆయన వ్యక్తిత్వం కోసం కూడా అభిమానిస్తారు.


అదే ఒక నటుడిగా, వ్యక్తిగా ఆయన సంపాదించుకున్న అసలైన విజయం.
ఈ పుట్టినరోజు సందర్భంగా…
మరిన్ని విజయాలు, మరిన్ని గుర్తుండిపోయే పాత్రలు, మరిన్ని చప్పట్లు, మరిన్ని సంబరాలు ఆయన సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
హ్యాపీ బర్త్‌డే బాలయ్య.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments