HomeEntertainmentసందీప్ కిషన్ సిగ్మా

సందీప్ కిషన్ సిగ్మా

- Advertisment -

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సిగ్మా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్…. హరిహరసుతన్ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. చిత్ర ఆడియో హక్కులను సరేగమా సొంతం చేసుకోగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments